అక్షరటుడే, కామారెడ్డి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్, రైల్వేస్టేషన్, టేక్రియాల్ ఎక్స్ రోడ్, భిక్కనూరు టోల్‌గేట్, మాచారెడ్డి చౌరస్తా ప్రాంతాల్లో ఒకే సమయంలో వాహనాల సోదాలు చేపట్టారు. అంతేకాకుండా రైళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నగదు, డ్రగ్స్, బంగారం తదితర వాటి తరలింపును అడ్డుకునేందుకు తనిఖీలు చేపట్టినట్లు కామారెడ్డి సీఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.