అక్షరటుడే, వెబ్‌డెస్క్: నిజామాబాద్ అర్బన్ బీఆర్‌ఎస్ నాయకులు ఆ పార్టీని వీడి.. కాంగ్రెస్ గూటికి చేరారు. నగరంలోని ఓ కార్పొరేటర్‌తో పాటు పలువురు సీనియర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, నగరాధ్యక్షుడు కేశ వేణు సమక్షంలో మంగళవారం పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో అర్సపల్లి కార్పొరేటర్ లావణ్య నవీన్, కంఠేశ్వర్ గుడి మాజీ చైర్మన్ కోవూరి జగన్, గంగపుత్ర సంఘం నగరాధ్యక్షుడు పల్లికొండ అన్నయ్య, మోక్ష ప్రవీణ్, బచ్చు పురుషోత్తం, గంగపుత్ర సంఘం నాయకులు అనిల్, ప్రసాద్, శంకర్, గంగాధర్, శాస్త్రి శంకర్, బంగ్లా సాయిలు, రాజు ఉన్నారు.