అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. బుధవారం ఆయన సమక్షంలో వివిధ పార్టీల నాయకులు నరసింహాచారి, షేక్‌ షాబాద్‌, షేక్‌ కాసీం, మరికొందరు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేసిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement