ఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలి

0

అక్షరటుడే, కామారెడ్డి: ఎన్నికల నిబంధనలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో సోమవారం మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా ప్రిసైడింగ్ అధికారులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను తమ నియోజకవర్గంలో తప్పనిసరిగా పొందాలన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఓటర్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 4 నుంచి 8 వరకు ఓటర్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు స్వీకరిస్తామని తెలిపారు. పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, మాకు పోలింగ్‌ నిర్వహించడం, ఈవీఎం, వీవీ ప్యాట్‌, డ్రాప్‌బాక్స్‌ నుంచి మాక్‌ పోల్‌ స్లిప్పులను తీసివేయడం తదితర అంశాలపై అవగాహన ఉండాలని సూచించారు.