అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నగరంలో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తిచేయాలని మేయర్‌ నీతూకిరణ్‌ అధికారులకు సూచించారు. గురువారం నగరంలోని 26, 46, 48 డివిజన్లలో కల్వర్టు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలోని కార్పొరేటర్లతో కలిసి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వనిత, అక్బర్‌ హుస్సేన్‌, నాయకులు అరున్‌, రాము, ఇంజినీర్‌ సల్మాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement