అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆర్మూర్‌లోని ఓ బూత్‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మెప్మా ఆర్పీ గంగామణిపై గెటవుట్ అంటూ మండిపడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. అసలేం జరిగిదంటే.. ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్‌లోని పలు బూత్‌లను రాకేశ్‌రెడ్డి సందర్శిస్తూ డ్యూటీలో ఉన్న మెప్మా ఆర్పీ గంగామణితో దురుసుగా ప్రవర్తించారు. గెటవుట్ ఇక్కడి నుంచి వెళ్లిపో.. ఇక్కడ నీకేం పని అంటూ మండిపడ్డారు. తనకు కమిషనర్ డ్యూటీ వేశారని చెప్పినా వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ఆర్పీ ఉద్యోగానికి రాజీనామా చేసింది. మున్సిపల్ కమిషనర్ రాజుకు రాజీనామా పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే హోదాలో ఉండి మహిళ ఉద్యోగిని కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఆయనకు మహిళలతో ఎలా మాట్లాడాలో తెలియదా అని ప్రశ్నించారు. తాను ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కారణమని తెలిపారు.