అక్షరటుడే, బాన్సువాడ: ఇటీవల కురిసిన వడగళ్ల వానతో రైతులు భారీగా నష్టపోయారని, ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. చందూరు మండలంలోని లక్ష్మీసాగర్‌ తండా, మేడిపల్లి, లక్ష్మాపూర్‌, చందూరు, పోతంగల్‌ మండలంలోని టాక్లీ, సోంపూర్‌, యాద్గార్‌పూర్‌ గ్రామాల్లో కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షం, వడగళ్ల వానతో పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిందని, సర్వే చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.