హామీలు అమలు చేసిన తర్వాతే ఓట్లు అడగాలి

0

అక్షరటుడే, బాల్కొండ: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే ఓట్లు అడగాలని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో శనివారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా రూ.రెండు లక్షల రుణమాఫీ, వరి పంట ఎకరాకు రూ.500వేల బోనస్‌, ఎకరానికి రూ.15వేల రైతుబంధు అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు పాల్గొన్నారు.