అక్షరటుడే, జుక్కల్ : విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థినులకు బుధవారం యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు భోజన సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని.. క్రీడల్లో సైతం రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రపంచ దేశాలతో పోటీపడేలా తీర్చిదిద్దాలని ఉపాధాయ్యులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జయప్రదీప్, ఎంఈవో దేవి సింగ్, కాంగ్రెస్ నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్రెడ్డి, నాయకులు పండరి, ఆకాశ్, ప్రిన్సిపాల్ సరోజ తదితరులు పాల్గొన్నారు.