అక్షరటుడే, ఎల్లారెడ్డి: పార్లమెంట్‌ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు హాజరయ్యారు. ఆయనతో పాటు జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, బాన్సువాడ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వారికి దిశానిర్దేశం చేశారు.