అక్షరటుడే, వెబ్ డెస్క్: ప్రజ్వల్ రేవణ్ణ అంశంపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని దేశం దాటించారు. నా లాంటి వారిని అరెస్టు చేశారు. ఇదెక్కడి దారుణం.’ ఈ విషయాన్ని అందరూ గమనిచాలంటూ.. కవిత వ్యాఖ్యానించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరు పరిచింది. ఈ సందర్భంగా ఆమె పైవిధంగా స్పందించారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండును కోర్టు ఈనెల 14 వరకు పొడిగించింది.