అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దొంగ పాస్‌పోర్టుతో మోర్తాడ్‌కు చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇది వరకు ఒక పాస్‌పోర్టు ఉండగా.. తప్పుడు ధృవపత్రాలతో మరొకటి పొంది గల్ఫ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్‌ అధికారులకు చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం.