అక్షరటుడే, ఆర్మూర్: బీఆర్‌ఎస్ పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం నందిపేట్, డొంకేశ్వర్ మండలాల బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అంతకుముందు బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్‌ను గెలిపించి పార్లమెంట్‌కు పంపాలన్నారు. అనంతరం నంది ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా స్థానిక చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నందిపేట మండలాధ్యక్షుడు సాగర్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.