అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వరి రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిజామాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పంట చేతికొచ్చే దశలో నష్టం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. పంట నష్టపోయిన రైతులకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా.. ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు, మేయర్ దండు నీతూకిరణ్, సుమన రెడ్డి, నాయకులు సూదం రవిచందర్, సిర్ప రాజు, సుజిత్‌సింగ్, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాశ్ పాల్గొన్నారు.
