అక్షరటుడే, ఆర్మూర్‌: హామీలను అమలు చేయని కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రజలు బుద్ధిచెప్పాలని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి అన్నారు. ఏర్గట్లలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడారు. అబద్ధపు వాగ్ధానాలతో కాంగ్రెస్‌ పార్టీ గద్దెనెక్కిందని.. అధికారంలోకి రాగానే హామీల అమలును మరిచిపోయిందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీలేదన్నారు. ప్రజల పక్షాన పోరాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.