అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు. మంగళవారం ఆయన జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో పోరాడతానన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రజలు తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, మాజీ మంత్రి రాజేశంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement