అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: పద్మశాలీలు బీఆర్‌ఎస్ కు మద్దతివ్వాలని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. సోమవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరంలో పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పద్మశాలీల అభివృద్ధికి బీఆర్‌ఎస్ ఎంతో కృషి చేసిందన్నారు. వారికి ఎల్లప్పుడూ అన్నివిధాలా అండగా ఉంటామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పద్మశాలీలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకటనర్సయ్య, కార్యదర్శి, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.