అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: అగ్ని ప్రమాదాలపై గోదాములు, షాపింగ్ మాల్స్ యజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. శనివారం నిజామాబాద్ కలెక్టరేట్ లో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. వారోత్సవాల్లో భాగంగా అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని, అగ్ని ప్రమాదాల నివారణ బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో మురళీ మనోహర్‌రెడ్డి, ఏడీఎఫ్‌వో భానుప్రతాప్, ఎస్‌ఎఫ్‌వో నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement