అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలని.. కొందరు అంతా తమకు తెలుసనే అతివిశ్వాసంతో తప్పులు చేస్తారని.. అందుకు తావివ్వొద్దని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. నగరంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహనను ఏర్పర్చుకోవాలని సూచించారు. గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన వారు సైతం ట్రైనింగ్ క్లాసులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులున్నారు.