అక్షరటుడే, వెబ్ డెస్క్: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు హెచ్చరించారు. శుక్రవారం బోధన్ పట్టణంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు సీడ్స్ దుకాణాలను తనిఖీ చేశారు. రైతులను మోసం చేసే విత్తన వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఓ దుకాణంలో ఎరువుల బస్తాల తుకాల్లో తేడాలను గుర్తించారు. వ్యాపారికి నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బురుడు గల్లీలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.