అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి ఎన్నికల రిట్నరింగ్‌ అధికారి, నిజామాబాద్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభించారు. నామినేషన్లను ఏప్రిల్‌ 25వ తేదీ వరకు రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నారు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 29 వరకు గడువు ఉంటుంది. మే 13న పోలింగ్‌ జరుగనుంది. జూన్‌ 4న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌ వద్ద ఆంక్షలు మొదలయ్యాయి. కలెక్టర్‌ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. పోలీసులు తనిఖీలు చేసి కేవలం ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే కలెక్టరేట్‌లోకి అనుమతిస్తున్నారు. ఇతర కార్యకలాపాల కోసం వచ్చే వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాతే కలెక్టరేట్ లోనికి అనుమతిస్తామని పోలీసులు చెప్పారు.