అక్షరటుడే, ఆర్మూర్ : రాష్ట్రంలో వ్యవసాయానికి అంకాపూర్ పేరొందిన గ్రామమని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ 2014లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి పెట్టుబడి రెట్టింపు చేశారన్నారు. బీజేపీ అభ్యర్థి అరవింద్ కు తనకు వ్యత్యాసం గమనించాలన్నారు. రాజకీయాలకతీతంగా అండగా నిలిచి తనను ఎంపీగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వినయ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాయిబాబాగౌడ్, అంకాపూర్ రైతులు పాల్గొన్నారు.