అక్షరటుడే, బోధన్: నాకు ఈ ఎన్నికలు చివరి అవకాశం.. మళ్లీ పోటీ చేస్తానో లేదో తెలియదు.. నన్ను గెలిపించండి అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం పెగడపల్లిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో ఎంపీగా అర్వింద్ గెలిచినప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. గత పదేళ్లకాలంలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ యువతకు ఉపాధి కల్పించకుండా మోసం చేశాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని పేర్కొన్నారు. ఐదేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి.. పెట్టుబడి డబుల్ చేశారని విమర్శించారు. వచ్చే ఖరీఫ్ నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.