అక్షరటుడే, ఇందూరు: పర్మిషన్‌ లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించవద్దని డీఈవో దుర్గాప్రసాద్‌ తల్లిదండ్రులకు సూచించారు. తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అడ్మిషన్స్ చేపడితే యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘షర్మిషన్స్‌ లేకున్నా.. అడ్మిషన్స్’ అనే శీర్షికన ‘అక్షరటుడే’లో ప్రచురితమైన కథనానికి డీఈవో స్పందించారు. హెచ్‌పీఎస్‌, నిశిత స్కూల్‌, ప్రెసిడెన్సీ కిడ్స్‌ స్కూల్‌, విక్టర్‌ ఎక్సలెన్స్‌ బడులకు విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని పునరుద్ఘాటించారు. సదరు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎంఈవోలను ఆదేశించారు. కాగా.. సోమవారం ఆయా పాఠశాలలకు వెళ్లిన అధికారులు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ చెపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఈవో జారీ ఇచ్చిన ఉత్తర్వు కాపీని యాజమాన్యాలకు అందజేశారు.