అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల తీరుపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పోలింగ్ సెంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఖిల్లా రోడ్డులోని పలు కేంద్రాల బయట చాలా మంది గుమిగూడడంతో పోలీసులపై ఆయన మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు కొడుతున్నారని.. ఇదేం పద్ధతి అని.. పోలీసులు కెరియర్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనేక మంది గుంపులుగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసిన తర్వాత అందరూ ఒకచోట చేరితే ఎలా ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. అందరినీ పంపించి వేయాలని సూచించారు. ఇక్కడ ఏమైనా మార్కెట్ జరుగుతుందా? అంటూ మండిపడ్డారు. ఓట్లు వేసిన తర్వాత కేంద్రాల వద్ద ఎవరూ ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.