అక్షరటుడే, ఆర్మూర్: క్రైస్తవుల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ఎంతో కృషి చేసిందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. పెర్కిట్‌లో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం క్రిస్టియన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించామని గుర్తు చేశారు. దళిత క్రైస్తవులకు అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేశామని పేర్కొన్నారు. కానీ పార్టీ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టకోకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతునొక్కడానికి ఈడీ, సీబీఐ కేసులు పెడుతోందని ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, పాస్టర్లు పాల్గొన్నారు.