అక్షరటుడే, ఇందూరు: మాధవనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాధవనగర్‌ వద్ద చేపడుతున్న ఆర్వోబీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. సంక్రాంతి వరకు వంతెన పనులు పూర్తవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మామిడిపల్లి ఆర్వోబీ ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇక అడవిమామిడిపల్లి రైల్వే బ్రిడ్జి పనులకు విడులైన నిధులను దారిమళ్లించారని మండిపడ్డారు. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఆయన వెంట అధికారులు, బీజేపీ నాయకులున్నారు.