అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను మానుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో మాట్లాడారు. మోడీ పాలనలో దేశంలో ఎక్కడ కూడా బాంబు పేలుళ్లు, మతతత్వ అల్లర్లు జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా కొందరు పనిగట్టుకొని మత రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో శాంతి, అభివృద్ధి నెలకొందన్నారు. అనంతరం చర్చలో భాగంగా స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారం దిశగా చర్చ జరిపారు. అంతకుముందు ఐటీఐలో వాకర్స్ తో కలిసి మాట్లాడారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, కార్పొరేటర్లు బట్టు రాఘవేందర్, మమత ప్రభాకర్, విక్రమ్, నారాయణ, ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.