తండ్రి మరణంపై ఎంపీ అర్వింద్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మాజీ మంత్రి, సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూయడంపై ఆయన కుమారుడు ఎంపీ అర్వింద్‌ ఎమోషనల్‌ అయ్యారు. తన తండ్రి మరణంపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. ఐ విల్‌ మిస్‌ యూ డాడీ.. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే..! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే.. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. ఎప్పటికీ నా లోనే ఉంటావు’ అంటూ బరువెక్కిన హృదయంతో స్పందించారు. తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

Advertisement
Advertisement
Advertisement