అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. వరుస పండుగలు, పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించరాదు. ముఖ్యంగా ఒకే చోట జనాలు గుమిగూడి ఉండడం నిషేధం. అలాంటి వారిపై ఈ సెక్షన్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేస్తారు. 144 సెక్షన్ కు లోబడి ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సీపీ కల్మేశ్వర్ సూచించారు.