అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్ పోలీసులు సోదాలు నిర్వహించారు. నిజామాబాద్ రైల్వేస్టేషన్ వద్ద దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలులో మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, స్పటికను పట్టుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మొత్తం 189 కిలోల నిల్వలను సీజ్ చేసుకున్నామని చెప్పారు. అలాగే కామారెడ్డి వద్ద నిర్వహించిన సోదాల్లో 40 కిలోల నల్ల బెల్లం, 60 కిలోల ఆలం పట్టుకున్నట్లు తెలిపారు.