అక్షరటుడే, ఇందూరు: ఐటీ హబ్‌పై ప్రత్యేక దృష్టి సారించి భవిష్యత్తులో ప్రముఖ కంపెనీలు వచ్చేలా కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. గురువారం నగరంలోని ఐటీ హబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఐటీ హబ్‌లో 671 మంది ఉద్యోగుల కెపాసిటీ ఉంటే, కేవలం 313 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. మిగతా ఖాళీల భర్తీపై తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో నిర్మించిన ఐటీ హబ్‌పై గత పాలకులు సరైన దృష్టి పెట్టలేకపోయారన్నారు. అనంతరం అక్కడి ఉద్యోగులు తమకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మమతా ప్రభాకర్, ప్రవళిక శ్రీధర్, సుమిత్ర కిషోర్, సవిత రాజ్, శ్రీనివాస్, మెట్టు విజయ్ తదితరులు పాల్గొన్నారు.