అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి నోటిఫికేషన్‌ విడుదలవడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. తొలిరోజు ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి సత్యనారాయణ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా మొదటి నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతుకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై 12 ఏళ్లుగా పోరాడుతున్నానని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ గళాన్ని పార్లమెంట్‌లో వినిపించేందుకు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్నానని చెప్పారు.