అక్షరటుడే, ఇందూరు: దేశ ప్రధానిగా మోదీ.. నిజామాబాద్‌ ఎంపీగా ఏడీ(అర్వింద్‌ ధర్మపురి) మరోసారి ఎన్నికవడం ఖాయమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన నగరంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ప్రధాని మోదీ అధికారంలో ఉంటేనే దేశం మరింత పురోగమిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు మరోసారి బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన వెంటనే బీజేపీ నాయకులు ఉన్నారు.