అక్షరటుడే, వెబ్ డెస్క్: కామారెడ్డి జిల్లాలో ఇద్దరు ఎంపీపీలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు వీగిపోయాయి. రామారెడ్డి ఎంపీపీ దశరథ్‌రెడ్డిపై సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో అవిశ్వాస సమావేశం నిర్వహించగా.. ఎంపీటీసీలు ఎవరూ హాజరు కాలేదు. దీంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించారు. అలాగే మద్నూర్ ఎంపీపీ వాఘ్మారే లక్ష్మీబాయిపై అవిశ్వాసం ప్రవేశపెట్టగా ఎంపీటీసీలు ఎవరూ రాలేదు. దీంతో ఇక్కడ కూడా అవిశ్వాసం వీగినట్లు ఆర్డీవో రమేశ్‌రాథోడ్ తెలిపారు.