అక్షరటుడే, బాన్సువాడ: రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మాతాశిశు ఆసుపత్రిలో గురువారం సోమేశ్వర్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ వైద్యులు హిమబిందు, అశ్విన్ రెడ్డి పలు పరికరాలను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. రూ.3 లక్షల విలువైన వైద్య పరికరాలను అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి పర్యవేక్షకులు శ్రీనివాస్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, రఘుపతి రెడ్డి, సతీష్ రెడ్డి, అంజిరెడ్డి, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  shock | విద్యుత్ షాక్​తో కూలీ మృతి