అక్షరటుడే, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. జిల్లా వ్యాప్తంగా 22 ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిల్లో నిరంతరం సోదాలు చేస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమలైన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.1.44 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.71.38 లక్షల డబ్బు, రూ.13.15 లక్షల విలువైన మద్యం, రూ.1.19 లక్షల విలువ గల మత్తు పదార్థాలున్నాయి. రూ.28 లక్షల విలువైన బంగారం, రూ.30 లక్షల విలువ చేసే ఇతర వస్తువులను అధికారులు సీజ్ చేశారు. వీటిని స్క్రీనింగ్ కమిటీకి అప్పజెప్పారు.