అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించవచ్చు. ఓటు వేసేందుకు వెళ్లే సమయంలో వీటిలో ఏదైనా ఒకదానిని తీసుకెళ్లాల్సి ఉంటుంది.
1) ఓటర్ కార్డు
2) ఆధార్ కార్డు
3) ఎన్‌ఆర్‌ఈజీఎస్ జాబ్ కార్డు
4) ఫోటోతో ఉన్న పోస్ట్ ఆఫీస్/బ్యాంక్ పాస్ బుక్
5) కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
6) డ్రైవింగ్ లైసెన్స్
7) పాన్ కార్డు
8) లేబర్ గుర్తింపు కార్డు
9) ఇండియన్ పాస్‌పోర్ట్
10) ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్
11) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు
12) ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు
13) దివ్యాంగుల గుర్తింపు కార్డు