అక్షరటుడే, బోధన్: ఎడపల్లి ఎంపీవో సుభాష్ చంద్రబోస్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని మూడోటౌన్ పరిధిలో ఎడపల్లి మండలానికి చెందిన ఓ మహిళా కార్యదర్శికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అనంతరం ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. తీరా మోసం చేయగా.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఎంపీవోపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎంపీవో గతంలో ఓ ఉన్నతాధికారి వద్ద పనిచేసిన సమయంలో ఆయన అండ చూసుకుని పలువురు సిబ్బందిని వేధించినట్లు తెలుస్తోంది.