అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. తిలక్‌గార్డెన్ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో.. ఉదయం 8 గంటల నుంచి 10 గంటలవరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. నగరంలోని ఖలీల్‌వాడి, రాష్ట్రపతి రోడ్, గాంధీచౌక్, నెహ్రూ పార్క్, హెడ్ పోస్టాఫీస్, కుమార్‌గల్లి, ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్, సరస్వతినగర్, ప్రగతి నగర్, పోచమ్మగల్లి, ద్వారకానగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగనుంది.
Advertisement
Advertisement