పోలీస్‌స్టేషన్‌లో కత్తితో సైకో వీరంగం

0

అక్షరటుడే, కామారెడ్డి: మద్యం మత్తులో ఓ సైకో రామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో వీరంగం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో స్టేషన్‌కు వచ్చి పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అలాగే ఫర్నీచర్‌ను సైతం ధ్వంసం చేశాడు. రామారెడ్డికి చెందిన రవి అనే యువకుడు మద్యం మత్తులో బుధవారం రాత్రి తల్లిదండ్రులతో గొడపడి పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. రవిని సముదాయిస్తున్న సమయంలో స్టేషన్‌లో ఉన్న సిబ్బందిపై కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ సిబ్బందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ సదరు యువకుడు పలుమార్లు పోలీస్‌స్టేషన్‌లో వీరంగం సృష్టించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఘటనపై కేసునమోదు చేసినట్లు రామారెడ్డి పోలీసులు తెలిపారు.