అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో కవితను సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా.. జూన్‌ 3వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు జడ్జి తెలిపారు. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో కవిత తీహార్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఈడీ కేసులో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ జరుపనుంది.