అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ అంత్యక్రియలు నిజామాబాద్ లోనే నిర్వహించనున్నారు. ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ లో ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని స్వగృహానికి తరలించారు. అక్కడ పలువురు ప్రముఖులు డీఎస్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల అనంతరం నిజామాబాద్ కు తరలించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ పట్టణంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.