పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఇద్దరు అనుమానితుల పరారీ

0

అక్షరటుడే, నిజామాబాద్‌: జిల్లా కేంద్రంలోని ఆరో టౌన్‌ నుంచి ఇద్దరు అనుమానితులు పరారయ్యారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దొంగతనం కేసులో ఇద్దరు అనుమానితులను ఆరోటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా అర్ధరాత్రి తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్నవారిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు నిజామాబాద్‌ నగరంలోని ఆటోనగర్‌కు చెందిన వ్యక్తిగా సమాచారం. ఓ దొంగతనం కేసులో వీరిని అనుమనితులుగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.