అక్షరటుడే ఇందూరు: విద్యాశాఖ ఆధ్వర్యంలో 42 రోజుల పాటు కొనసాగిన టీచర్ ట్రెయినింగ్ కోర్స్ శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆర్ట్ విభాగం కోర్స్ డైరెక్టర్ వాసుదేవరావు మాట్లాడుతూ.. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల అభ్యర్థులకు టైలరింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. సర్టిఫికెట్ తో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఎన్నో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఆర్ట్ టీచర్ కేశవ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.