అక్షరటుడే, ఆర్మూర్: పొలంలో గడ్డికి నిప్పంటించగా.. పక్కనే ఉన్న ఈత వనం దహనమైన ఘటన గురువారం జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండలో చోటు చేసుకుంది. గౌడ కులస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తొర్లికొండ గ్రామంలోని కంచెలో ఈత వనం ఉంది. కాగా పక్కనే ఉన్న ఓ పొలం నిర్వాహకుడు గడ్డికి నిప్పంటించి ఇంటికి వెళ్లాడు. ఆ మంట కాస్త ఈత వనంలోకి వ్యాపించి సుమారు 500కు పైగా చెట్లు అగ్ని ఆహుతయ్యాయి. తమకు తీవ్ర నష్టం జరిగిందని గౌడ కులస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.