అక్షరటుడే, బాన్సువాడ: దొంగతనానికి వచ్చిన వ్యక్తిని గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేయడంతో మృతి చెందిన ఘటన శుక్రవారం వర్ని మండలం తగిలేపల్లిలో చోటు చేసుకుంది. గురువారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో తగిలేపల్లికి చెందిన మైదం నారాయణ(40) అదే గ్రామంలోని బీసీ కాలనీలో ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన యజమాని చుట్టుపక్కల వారిని పిలిచి దేహశుద్ధి చేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న నారాయణను అతని కుటుంబీకులు ఇంటికి తీసుకెళ్లారు. ఐదు నిమిషాల్లోపే అతను మృతి చెందినట్లు కుటుంబీకులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.