అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. సోమవారం ఉదయం విధులు బహిష్కరించి జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి వద్ద సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్, ఉపాధ్యక్షుడు సురేశ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా పదో తేదీలోగా స్టైఫండ్ ఇచ్చేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలన్నారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు.