అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో పార్కు స్థలం కబ్జా అవుతోంది. కొందరు వ్యక్తులు పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని చదును చేసి హద్దురాళ్లు పాతారు. ఈ విషయమై స్థానికులు నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 125, 126 లో ఏర్పాటు చేసిన వెంచర్ కు చెందిన పార్కు స్థలంలో అక్రమంగా హద్దురాళ్లు ఏర్పాటు చేశారని, సత్వరమే కార్పొరేషన్ అధికారులు స్పందించి బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కబ్జాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.