అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం మెంగారం, బోనాల్, చింతల గుట్ట తండా పరిసరాల్లో ఎలుగుబంటి సంచరించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం వారాంతం సంత ముగించుకొని ఆయా గ్రామాలకు వెళ్తున్న వారికి మెంగారం సమీపంలో ఎలుగుబంటి కనిపించింది. చెరువులో నీరు తాగేందుకు వస్తున్న భల్లూకాన్ని చూసి రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంటి రెండు గ్రామాల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుండడంతో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని బంధించాలని కోరుతున్నారు.